Apr 14,2021 12:08

న్యూఢిల్లీ: కరోనా సమయంలో సిబిఎస్‌ఇ బోర్డు పరీక్షలు నిర్వహించటంపై.. ప్రధాని నరేంద్రమోడీ, విద్యాశాఖామంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంఖ్‌తో, ఉన్నతాధికారులతో ఈరోజు మధ్యాహ్నం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సిబిఎస్‌ఇ బోర్డు పరీక్షలను నిర్వహించాలా? వద్దా? అనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా రెండో దశ విజృంభిస్తున్న సమయంలో 10, 12 తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే సిబిఎస్‌ఇ ప్రకటించింది. దీనిపై కరోనా సమయంలో పరీక్షలు నిర్వహిస్తే.. వైరస్‌ వ్యాప్తి మరింత ఎక్కువవుతుందని.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ పరీక్షల్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.