Apr 14,2021 14:20

న్యూఢిల్లీ : కరోనా ఉధృత రూపం దృష్ట్యా సిబిఎస్‌ఇ 10వ తరగతి బోర్డు పరీక్షలను కేంద్ర విద్యా శాఖ రద్దు చేసింది. ప్లస్‌ 2 పరీక్షలను వాయిదా వేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో సిబిఎస్‌ఇ బోర్డు పరీక్షలు రద్దు చేయాలన్న ప్రతిపాదనపై బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశం జరిగిన తర్వాత  కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, 12వ తరగతి  తదుపరి పరీక్షల తేదీలు పరిస్థితులు చక్కబడ్డాక ప్రకటిస్తామని పేర్కొంది. పరీక్షలు జరగడానికి 15 రోజుల ముందుగానే తేదీలను ప్రకటిస్తామని కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. క్లాస్‌ 10 ఫలితాలను ఇంటర్నెట్‌ మార్కుల ఆధారంగా, బోర్డు ఆబ్జెక్టివ్‌ ప్రమాణం ఆధారంగా తయారు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది.