అబ్దుల్ సలాం నాయ పోరాట కమిటీ
ప్రజాశక్తి - నంద్యాల క్రైమ్: అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అబ్దుల్సలాం న్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నంద్యాలలోని సంజీవనగర్ గేట్లో రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆవాజ్ కమిటీ జిల్లా కన్వీనర్ మస్తాన్లి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ సలాం నాయ పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ అసెంబ్లీలో సిబిఐ విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిఐ, క్రైమ్ పార్టీ పోలీసులు గంగాధర్ అండ్ క్రైమ్ టీంను అరెస్టు చేయాలని, వారిని ఉద్యోగాల్లో నుండి తొలగించి వారు అక్రమంగా సంపాదించిన ఆస్తులపై ఎసిబి అధికారులతో విచారణ జరిపించాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి బాధ్యులపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అనంతపురంలో బాలికపై అత్యాచారం చేసిన చంపిన దోషులకు యావజ్జీవ శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. న్యాయ పోరాట కమిటీ సభ్యులు తోట మద్దులు, అబ్దుల్, సలామ్ మౌలానా, ఇద్రూస్, మౌలానా, బాబా ఫక్రుద్దీన్, ఎస్ఎండి రఫీ, మహబూబ్ బాషా, అక్బర్ హుస్సేన్, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు జకీర్, ఫారీద్, సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు గౌస్, లక్ష్మణ్, సిపిఎం మండల కార్యదర్శి సద్దాం హుస్సేన్, రైతు సంఘం నాయకులు సోమన్న, ఐఎఫ్టియు అధ్యక్షులు ఇర్ఫాన్, జాను జాగో జాతీయ ప్రధాన కార్యదర్శి మహబూబ్ బాషా, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హుస్సేన్ బాషా శివ, ఆవాజ్ యూత్ సద్దాం హుస్సేన్, ముస్లిం మత పెద్దలు, ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
సంజీవ నగర్లో రాస్తారోకో చేస్తున్న నాయకులు