
న్యూఢిల్లీ : మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సిబిఐ దర్యాప్తును సవాల్‌చేస్తూ.. అనిల్‌దేశ్‌ముఖ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్ కౌల్ నేతృత్వంలో ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఆరోపణలు చాలా తీవ్రమనవిగా పరిగణించి.. సిబిఐ దర్యాప్తు అవసరమని స్పష్టం చేసింది. ఆరోపణల తీవ్రతను బట్టి, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తుల హోదాలను బట్టి వారిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేపట్టడం అవసరమేనని తెలిపింది. అలాగే పరమ్‌బీర్, దేశ్‌ముఖ్‌లు తమ పదవుల నుంచి తప్పుకునేంతవరకు ఇద్దరూ కలిసి పనిచేసినవారే.. మరి అటువంటప్పుడు సిబిఐ ఎందుకు దర్యాప్తు చేపట్టకూడదు అని ప్రశ్నించింది. అనంతరం పిటిషన్లను కొట్టివేసినట్లు ప్రకటించింది. పరమ్‌బీర్‌సింగ్, దేశ్‌ముఖ్‌పై చేసిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు అవసరమని బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి దేశ్‌ముఖ్ సిబిఐ దర్యాప్తును సవాల్ చేస్తూ... సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అవినీతి ఆరోపణనెదుర్కొంటున్న అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.