క్యాన్సర్ ఆపరేషన్ విజయవంతం
ప్రజాశక్తి - నంద్యాల క్రైమ్: నంద్యాలలోని సెవెన్ హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పెద్ద ప్రేగు క్యాన్సర్ ఆపరేషన్‌ను శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా నిర్వహించినట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మారుతి కుమార్, వైద్యులు గెలివి సిద్ధార్థ్‌లు తెలిపారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ చాపిరేవుల గ్రామానికి చెందిన పక్కిరయ్య ఒకటిన్నర సంవత్సరం నుంచి కడుపునొప్పితో బాధపడుతూ చికిత్స కోసం హాస్పటల్‌కు వచ్చాడన్నారు. ఈ నెల 15న అవసరమైన పరీక్షలు నిర్వహించి పెద్దప్రేగు చిన్నగా అవడం వలన ఇబ్బంది పడుతున్నాడని నిర్ధారించి వెంటనే శస్త్రచికిత్స చేసి ఈ నెల 20న తిరిగి పెద్దప్రేగును విడిగా చేసినట్లు తెలిపారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ పథకం ద్వారా ఉచితంగా శస్త్రచికిత్స చేసినట్లు చెప్పారు. నంద్యాల పరిసర ప్రాంత ప్రజలకు సాధ్యమైనంతవరకు ఉచితంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందిస్తామని, ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని కోరారు. హాస్పిటల్ సిబ్బంది సురేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ,ప్రేమ్ కుమార్, రాజశేఖర్, నాగేంద్ర, మురళీ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న వైద్యులు