Feb 12,2021 23:38

సర్పంచి అభ్యర్థి ఆవుల జయసుధ

- బానకచర్లను అభివృద్ధి చేసి చూపిస్తా
- సర్పంచి అభ్యర్థి ఆవుల జయసుధ
ప్రజాశక్తి - పాములపాడు:
 పాములపాడు మండలం బానకచర్ల గ్రామ ప్రజలు తనకు ఓటు వేసి గ్రామాభివృద్ధికి, సేవ చేసేందుకు అవకాశం ఇవ్వాలని సర్పంచి అభ్యర్థి ఆవుల జయసుధ కోరారు. శుక్రవారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవుల జయసుధ, ఆవుల నారాయణ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరేలా చూస్తున్నారని చెప్పారు. అందరికీ అందుబాటులో గ్రామంలోనే పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ అభివృద్ధి పనులు చేపడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆర్థర్‌ సహకారంతో బానకచర్ల గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చామని తెలిపారు. మైనార్టీ కాలనీల్లో సిసి రోడ్లు, డ్రెయినేజీ, గ్రామంలో ఇతర సమస్యలను పూర్తిగా పరిష్కరించి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మల్లికార్జున్‌ రెడ్డి, ఓబుల్‌ రెడ్డి, సుబ్బారెడ్డి, భాస్కర్‌ రెడ్డి, నరసింహులు, రంగస్వామి పాల్గొన్నారు.