Oct 27,2021 22:00

ఫొటో : రికార్డులను పరిశీలిస్తున్న ఎంపిడిఒ

ఫొటో : రికార్డులను పరిశీలిస్తున్న ఎంపిడిఒ
సచివాలయంలో ఆకస్మిక తనిఖీ
ప్రజాశక్తి-దగదర్తి : మండలంలోని తడకలూరు సచివాలయాన్ని మండల ప్రజా పరిషత్‌ అధికారి కళాధర్‌ రావు బుధవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ అందే విధంగా చూడాలని అధికారులు సూచించారు. అందకుండా గాని ఉంటే ఎందువల్ల అందటం లేదని పరిశీలించి అటు వారికి రికార్డును సరిచేసి వెంటనే సంక్షేమ పథకాలు అనే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సచివాలయం కి వచ్చినా అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులకు పంపాలని ఆయన సూచించారు. ఏ ఒక్క అర్జీ పెండింగులో లేకుండా చూసుకోవాలన్నారు. గ్రామంలో ఎప్పటికప్పుడు చెత్తా.చెదారం. మురికి తొలగించుకుంటూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట మండల విద్యాశాఖ అధికారి ఎం భాస్కర్‌, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
జాగ్రత్తలు పాటించండి