Oct 01,2020 22:42

కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ

కలెక్టర్‌ గంధం చంద్రుడు
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశించారు. గురువారం నగరంలోని రెండవ రోడ్డులో ఉన్న 64 వ వార్డు సచివాలయంను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని సర్వీసులు వచ్చాయి, వాటిలో ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారనే వివరాలను సచివాలయ ఉద్యోగులతో అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి అందిన అర్జీలకు నిర్ధేశిత గడువులోగా పరిష్కారం చూపించాలని ఆదేశించారు.ఉద్యోగులంతా సకాలంలో సచివాలయానికి హాజరై ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలకు తెలియజేసి వారి నుంచి వచ్చిన సర్వీసు లకు సత్వరమే పరిష్కారం చూపించాలని ఆదేశించారు.
కోవిడ్‌ ఆసుపత్రి పరిశీలన
నగరంలోని శారదా నగర్‌లో ఉన్న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, క్యాన్సర్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చినవారిని కలెక్టర్‌ పరామర్శించారు. పాజిటివ్‌ వచ్చిన వారితో నేరుగా సంభాషించారు. ఆసుపత్రిలో సేవలు ఎలా అందుతున్నాయి, డాక్టర్లు సమయానికి చికిత్స అందిస్తున్నారా లేదా, ఇక్కడి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, భోజనం రుచికరంగా ఉందా లేదా తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్‌ వ్యాధిపట్ల ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని కలెక్టర్‌ తెలిపారు. సరైన చికిత్స అందించడం ద్వారా ఆ వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటున్నారన్నారు. ఇప్పటికే సుమారు 60 వేల మంది కోవిడ్‌ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొని, దాని నుంచి కోలుకుని వారు ఇళ్లకు సంతోషంగా వెళ్లారని తెలిపారు.
నాడు - నేడు పనులను నాణ్యతతో చేపట్టాలి
మనబడి నాడు - నేడు కింద చేపడుతున్న పనులను నాణ్యతతో చేపట్టాలని ఇంజనీరింగ్‌ అధికారులను కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశించారు. గురువారం సాయంత్రం నగరంలోని కక్కలపల్లి కాలనీలో ఉన్న ఎంపిపియుపి పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో రాజీపడొద్దన్నారు. ఒకటో తరగతి విద్యార్థులకు కుళాయిలు అందే విధంగా నిర్మించలేదని, వెంటనే వారికి కూడా నీరు అందేలా తగిన ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. పాఠశాలకు అందిన ఆటవస్తువులను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు. అక్కడ ఫ్లోరింగ్‌ లో హెచ్చుతగ్గులు ఉండటాన్ని గమనించి వెంటనే వాటిని సరిదిద్దవలసిందిగా సైట్‌ ఇంజనీర్‌ రాజశేఖర్‌ రెడ్డిని ఆదేశించారు. పనులు సక్రమంగా చేపట్టక పోతే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని సైట్‌ ఇంజినీర్‌ పై జిల్లా కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈవీఎం గోదాము తనఖీ
నగరంలోని పాత ఆర్డీవో కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన ఈవీఎం గోదామును కలెక్టర్‌ గంధం చంద్రుడు తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎంలు, వివి ప్యాట్‌ లను తనిఖీ చేయాల్సి ఉండగా, అందులో భాగంగా గురువారం మధ్యాహ్నం ఈవీఎం గోదామును తనిఖీ చేశారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక నిఘా ఉంచాలని విధులు నిర్వర్తిస్తున్న పోలీసు మరియు సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఆయన వెంట అసిస్టెంట్‌ కలెక్టర్‌ జి.సూర్య, ఇన్‌ఛార్జి నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కెఎస్‌ఎస్‌.వెంకటేశ్వరరావు, డీఈవో శామ్యూల్‌, నగర పాలక సంస్థ కమిషనర్‌ పివిఎస్‌ఎన్‌. మూర్తి, డిప్యూటీ కమిషనర్‌ రమణారెడ్డి, మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాజేష్‌, కార్పొరేషన్‌ సెక్రటరీ సంగం శ్రీనివాసులు,