Oct 27,2021 23:42

సచివాలయాన్ని ప్రారంభిస్తున్న శ్రీనివాస్‌

ప్రజాశక్తి -టెక్కలి రూరల్‌: సచివాలయాలతో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం పోలవరం గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, తద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి అట్ల సరోజనమ్మ, సర్పంచ్‌ గురివెళ్లి చిన్ననాయుడు, దవళ రమేష్‌కుమార్‌, గ్రామ కార్యదర్శులు, అధికారులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.