Nov 30,2020 22:07

శభాష్‌ టెక్నికల్‌ ఎనాలిసిస్‌ వింగ్‌ : ఎస్‌పి
ప్రజాశక్తి-చిత్తూరు నగరం:
నైపుణ్యం వద్ది, నేరాల పరిశోధనలో సాంకేతికత మెలకువలను అందిపుచ్చుకొని నెలరోజుల్లోనే ఫిర్యాదుదారులు పోగొట్టుకొన్న 277 మొబైల్‌ ఫోన్లు రికవరీ చేసి కేసును సాధించిన టెక్నికల్‌ ఎనాలిసిస్‌ వింగ్‌ను ఎస్పీ సెంథిల్‌ కుమార్‌ అభినందించారు. సోమవారం స్థానిక పోలీస్‌ అతిథి భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్తగా నియమించబడ్డ కానిస్టేబుల్స్‌లో బిటెక్‌, ఎంటెక్‌ ఉత్తీర్ణులైన 20 మందిని ఎంపిక చేసి సాంకేతికతపరంగా వారిని తర్ఫీదు చేయటకు అక్టోబర్‌ 6వ తేదీన టెక్నికల్‌ ఎనాలిసిస్‌ వింగ్‌ను జిల్లా ఎస్పి ప్రారంభించినట్తు తెలిపారు. శిక్షణ కాలంలో నేర చేధనలో సాంకేతికతను ఉపయోగించుటలో అనుభవజ్ఞులైన అధికారులు సిబ్బందిని రాటు తేల్చారని తెలిపారు. అత్యంత తక్కువకాల వ్యవధిలోనే సాంకేతికపర శిక్షణపూర్తి చేసుకొని సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్న టీం సభ్యులను, వారికి శిక్షణ ఇచ్చిన హెడ్‌కానిస్టేబుళ్లు దేవరాజులురెడ్డి, బాపూజీ, ఐటీ ఎస్పీని ప్రత్యేకంగా అభినంధించినారు. ఎస్‌బి డిఎస్పీ సుధాకర్‌ రెడ్డి, అడిషనల్‌ ఎస్పీ మహేష్‌ పాల్గొన్నారు.