Apr 14,2021 13:14

వాషింగ్టన్‌ : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు ఆయుధాల విక్రయాలను కొనసాగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ స్పష్టం చేశారు. అత్యాధునిక ఎఫ్‌-35 యుద్ధవిమానాలు, డ్రోన్లు, ఇతర పరికరాలతో పాటు 23 డాలర్ల మేరకు విక్రయించనున్నట్లు బైడెన్‌ కాంగ్రెస్‌కు తెలిపారు. యుఎఇకి ప్రతిపాదిత విక్రయాలను బైడెన్‌ కొనసాగించనున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఆమోదించిన ఒప్పందాలను సమీక్షించేందుకే బైడెన్‌ ఆ ప్రతిపాదనలను తాత్కాలికంగా నిలిపివేశారని అన్నారు. ట్రంప్‌ పదవీ విరమణకు ముందే గల్ఫ్‌ దేశానికి ఆయుధాల అమ్మకాలు ఖరారు చేయబడ్డాయని అన్నారు. ఇజ్రాయిల్‌తో సంబంధాలను కొనసాగించేందుకు యుఎఇ ఆమోదించిన నేపథ్యంలో.. అమెరికా అబ్రహం ఒప్పందాలకు అనుగుణంగానే గతేడాది నవంబర్‌లోనే యుఎఇకి ఆయుధాలను విక్రయించేందుకు ఆమోదం తెలిపినట్లు ట్రంప్‌ కాంగ్రెస్‌కు తెలిపారు. ట్రంప్‌ పరిపాలన చివరి నెలలో ఇజ్రాయిల్‌ ఒప్పందంలో భాగంగా యుఎఇ, బహ్రెయిన్‌, సూడాన్‌, మొరాకోలతో ఒప్పందాలను కుదుర్చుకుంది.