Jul 30,2021 21:08

ప్రజాశక్తి - భవానీపురం :భవానీపురం రీజనల్‌ సైన్స్‌ సెంటర్‌ నందు అప్‌కాస్ట్‌, ఎపిపిఎస్‌టిఎఫ్‌ ఆధ్వర్యంలో కష్ణా జిల్లా విద్యాశాఖ సైన్స్‌ కిట్‌ -2021 పై శిక్షణా కార్యక్రమం- సైన్స్‌ క్యాంపెయిన్‌'' శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్‌కాస్ట్‌ మెంబర్‌ సెక్రటరీ అపర్ణ, డిఇఓ తాహెరా సుల్తానా మాట్లాడుతూసైన్స్‌ ఉపాధ్యాయులు ఇటువంటి శిక్షణా కార్యక్రమాల ద్వారా తమ బోధనా నైపుణ్యాలను, సామర్థ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలని, దానికి అప్‌కాస్ట్‌ ఎల్లప్పుడూ ఉపాధ్యాయులకు సహకారం అందిస్తుందన్నారు. నిత్య జీవిత సంఘటనలతో సైన్స్‌ను అనుసంధానం చేస్తూ బోధించాలని తెలిపారు. ఫిజిక్స్‌లోని బేసిక్స్‌ మరియు మౌలిక భావనలను సైన్స్‌ కిట్‌ ద్వారా బోధిస్తే విద్యార్థుల్లో ఫిజిక్స్‌ పట్ల భయం పోతుందన్నారు. . భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు ఇటువంటి అమూల్యమైన శిక్షణా తరగతులను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.శివనాగేశ్వరరావు, విజ్జానభారతి మెంబర్‌ యు. లక్ష్మణసూరి, కె. మధుసూధనరావులు రిసోర్స్‌ పర్సన్‌గా వ్యవహరించారు. అప్‌కాస్ట్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ధిల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శిక్షణా తరగతులకు జిల్లా నుండి ప్రత్యక్షంగా 25 మంది ఆన్‌లైన్‌లో 800 మందికి పైగా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని, శిక్షణ పొందారు.