Jan 15,2022 09:40

లండన్‌ : ప్రిన్స్‌ ఆండ్రూ సైనిక బిరుదులు, రాజభరణాన్ని కోల్పోయాడు. ఈ విషయాన్ని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆండ్రూ మైనర్‌గా ఉన్న తనపై 2001లో అత్యాచారానికి పాల్పడ్డారంటూ అమెరికాకు చెందిన వర్జీనియా గిఫ్రే వేసిన కేసులో ప్రిన్స్‌ ఆండ్రూ విచారణ నెదుర్కొంటున్నారు. ఈ కేసును రద్దు చేయించుకోవడానికి ఆయన శతవిధాలా యత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆయన రాచరికపు హౌదాకు సంబంధించిన అన్ని రక్షణలను తొలగించారు. సామాన్య పౌరుడి హౌదాలో ఈ కేసులో విచారణను ఆండ్రూ ఎదుర్కోవాల్సి ఉంది. అమ్మాయిలను అక్రమంగా సరఫరా చేసే ఎపిస్టోన్‌ తనను ప్రిన్స్‌ ఆండ్రూ దగ్గరకు పంపగా, ఆయన తనపై అత్యాచారానికి పాల్పడ్డారని గిఫ్రె చెప్పారు. దీనిని ఆండ్రూ మొదట బుకాయించినా, వీరిరువురూ కలిసి ఉన్న అప్పటి ఫొటో ఒకటి వెలుగులోకి రావడంతో ఆయన దొరికిపోయారు.