Jan 14,2021 08:34

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌-1000 టోర్నమెంట్‌లో సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ ప్రి క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించగా.. పారుపల్లి కశ్యప్‌ పరాజయాన్ని చవిచూశాడు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్‌ పోటీలో సైనా 21-15, 21-15తో మలేషియాకు చెందిన కిసోనాను చిత్తుచేసింది. ఇక పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్‌ పోటీలో శ్రీకాంత్‌ 21-12, 21-11 పాయింట్ల తేడాతో భారత్‌కే చెందిన సౌరభ్‌వర్మను చిత్తుచేశాడు. ఇక పారుపల్లి కశ్యప్‌ కెనడాకు చెందిన జేసన్‌ ఆంథోనీతో పోరులో కాలి పిక్క పట్టేయడంతో మ్యాచ్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. కశ్యప్‌ 9-21, 21-13పాయింట్లతో చెరోసెట్‌ గెల్చుకోగా.. మూడో గేమ్‌లో కశ్యప్‌ 8-14తో వెనుకబడి ఉన్నప్పుడు కండరాలు పట్టేయడంతో పోటీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. మరో పోటీలో సౌరభ్‌ వర్మ 15-21, 17-21తో రుస్తవిటో(ఇండోనేషియా) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జోడీ 14-21, 21-16, 21-14తో కొరియాకు చెందిన కిమ్‌-లీ జోడీని చిత్తుచేసి ప్రి క్వార్టర్స్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.