Oct 27,2021 20:44

న్యూఢిల్లీ :  కరోనా తర్వాత సైబర్‌ మోసాలు క్రమంగా పెరిగాయని.. వినియోగదారులు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎయిర్‌టెల్‌ సిఇఒ గోపాల్‌ విట్టల్‌ సూచించారు. తప్పుడు ఫోన్‌ కాల్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ మోసాల పట్ల ఖాతాదారులు తమను తాము కాపాడుకునేలా భద్రంగా ఉండాలన్నారు. ఫోన్‌లో ఎవరడిగిన కూడా కస్టమర్‌ ఐడి, ఎంపిన్‌, ఒటిపి తదితర వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని తెలుపకూడదన్నారు.