Nov 26,2020 16:19

ర్యాలీ చేపడుతున్న కార్మికులు, స్కీమ్‌వర్కర్లు

ప్రజాశక్తి-బలిజిపేట : మండలంలో గురువారం సిఐటియు, ప్రజా సంఘాల ఆధ్వర్యాన చేపట్టిన సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం నుంచి బస్టాండ్‌ వరకు రిక్షా, ఆటో, మిల్లు కార్మికులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ఇతర రంగాల కార్మికులు ర్యాలీ చేపట్టారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బస్టాండ్‌ ఆవరణలో మానవహారం ఏర్పాటు చేశారు. సిఐటియు మండల కార్యదర్శి ఎం.మన్మథరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేస్తోందన్నారు. కేంద్రానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గేదెల సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వంజరాపు సత్యంనాయుడు, సిఐటియు నాయకులు పైల సత్యనారాయణ పాల్గొన్నారు.