Mar 02,2021 22:42

విజేతలకు ట్రోఫీ అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి - రాప్తాడు     స్థానిక ఆర్డిటి క్రీడామైదానం నందు రెండు రోజుల నుంచి నిర్వహిస్తున్న ఏడవ సీనియర్స్‌ సాఫ్ట్‌ బాల్‌ క్రీడా పోటీల్లో కడప జట్టు విజేతగా నిలిచింది. రెండవ స్థానంలో గుంటూరు, మూడో స్థానంలో అనంతపురం జట్లు నిలిచాయని సాఫ్ట్‌ బాల్‌ రాష్ట్ర కార్యదర్శి సి వెంకటేశులు మంగళవారం తెలిపారు. విజేతలకు బహుమతులు అందజేసే కార్యక్రమానికి ఆర్డిటి చైర్మన్‌ తిప్పేస్వామి, అనంత బయోటెక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాధా కష్ణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. మన రాష్ట్ర జట్టు జాతీయ స్థాయిలో ప్రథమ,ద్వితీయ స్థానాల్లో వస్తోందన్నారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. ఇంటర్‌ జిల్లా టోర్నమెంట్‌ నందు ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఈ నెల 9 నుంచి 17 వరకు జాతీయస్థాయిలో పాల్గొనే ఆంధ్ర ప్రదేశ్‌ జట్టుకు కోచింగ్‌ క్యాంప్‌ ఆర్డీటి క్రీడా గ్రామం నందు నిర్వహిస్తామన్నారు. దీనిలో పాల్గొనే క్రీడాకారులు జాతీయ స్థాయిలో కూడా మంచి ప్రతిభాపాటవాలు కనబరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ సీఈఓ ప్రవీణ్‌ అనౌకర్‌, జాతీయ కార్యదర్శి ఎల్‌ ఆర్‌ మౌర్య, రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌ నాగరాజు, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ కేశవమూర్తి, నరసింహారెడ్డి, పిడిలు గోపాల్‌ రెడ్డి , లతా, కోచ్‌ఓబులేష్‌, మల్లికార్జున , 13 జిల్లాల నుంచి వచ్చిన సాఫ్ట్‌ బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు, జిల్లా కార్యదర్శులు, క్రీడాకారులు పాల్గొన్నారు