Sep 18,2021 22:39

మెడికల్‌ షాపులోకి దూసుకెళ్లిన కారు

నలుగురుకి గాయాలు
ప్రజాశక్తి - తెనాలి :
అకస్మాత్తుగా కారు షాపులోకి దూసుకురావడంతో స్కూటర్‌ నుజ్జునుజ్జు కాగా నలుగురికి గాయాలయ్యాయి. పట్టణ టు టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్‌ బిల్డింగ్‌ దిగువ భాగాన ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌లో హర్షిత మెడికల్‌ షాపు ఉంది. శనివారం సాయంత్రం సమయంలో మార్కెట్‌ ప్రాంతంలోకి వచ్చిన కారు అకస్మాత్తుగా మెడికల్‌ షాపులోకి దూసుకు వెళ్ళింది. దీంతో షాపు యజమానితో పాటు మరో ముగ్గురు గాయపడ్డారు. షాపు ముందు నిలిపి ఉంచిన స్కూటర్‌ పూర్తిగా ధ్వంసమైంది. అనుకోకుండా జరిగిన ఘటనలో ప్రాణాపాయం తప్పటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు, ట్రాఫిక్‌ పోలీసులు అక్కడికి చేరుకొని డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.