Oct 28,2021 20:06

అల్లు అర్జున్‌ నటిస్తున్న 'పుష్ప' చిత్రంలోని మూడో పాట 'సామీ నా సామీ' లిరికల్‌ వీడియోను గురువారం ఉదయం చిత్రబృందం సోషల్‌ మీడియాలో పంచుకొంది. ఈ మాస్‌ సాంగ్‌ను మౌనికా యాదవ్‌ అలపించారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. 'పుష్ప ది రైజ్‌' పేరుతో తొలి భాగాన్ని క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దర్శకుడు సుకుమార్‌-అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక డీ గ్లామర్‌ పాత్రలో కనిపించనున్నారు. మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీమేకర్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది.

'సామీ నా సామీ' పాట https://youtu.be/5q-U-qzUZPM