Nov 30,2020 21:21

అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న ఐద్వా, ఆవాజ్‌ నాయకులు

   ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ : మూడు రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కబోతున్న యువతి షాహిదాను అత్యంత కిరాతంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా, ఆవాజ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. కళ్యాణదుర్గం మండల చాపిరి గ్రామానికి చెందిన షాహిదా హత్య కేసులను నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఐద్వా, ఆవాజ్‌ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఆ సందర్భంగా ఆవాజ్‌ నగర అధ్యక్ష, కార్యదర్శులు మసూద్‌, వలి, ఐద్వా నగర అధ్యక్ష, కార్యదర్శులు హసీనా, చంద్రికలు మాట్లాడుతూ షాహిదా హత్య సంఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలన్నారు. నిందితులకు మరణ శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. షాహిదా కుటుంబానికి న్యాయం చేకుంటే వారి కుటుంబానికి మద్దతుగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్‌ జిల్లా కమిటీ సభ్యులు బాబు, నూరుల్లా, ఫయాజ్‌, ఐద్వా నాయకురాలు భాను, కెవిపిఎస్‌ నాయకులు వెంకటేష్‌, రాజు పాల్గొన్నారు.