Jan 26,2021 00:50

తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి-నాతవరం : నాతవరం మండలం సరుగుడు పంచాయతీ శివారు యరకంపేట గిరిజన రైతులు సాగు చేస్తున్న ఎర్రకొండ, నల్లకొండ రెవెన్యూ కొండపోడుకు పట్టాలివ్వాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన నాతవరం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డీటీకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి అడిగర్ల రాజు మాట్లాడుతూ, మండలంలో సాగు చేస్తున్న రైతులకు రెవెన్యూ, ఫారెస్ట్‌ అధికారులు సర్వే సేసి పట్టాలివ్వాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు జె.కృష్ణబాబు, సింహాచలం, జ్యోతి, రాంబాబు పాల్గొన్నారు.