Aug 09,2021 13:04

మంగళగిరి : కర్నూలు జిల్లా నంద్యాల రిపోర్టర్‌ కేశవ్‌ హత్య ఘటనపైన సమగ్ర దర్యాప్తు చేయాలని డిజిపి గౌతం సవాంగ్‌ ఆదేశించారు. డిజిపి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హత్యకు పాల్పడిన నింధితులను తక్షణమే అరెస్టు చేయాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. సస్పెండ్‌ అయిన కానిస్టేబుల్‌ తో పాటు హత్యతో ప్రమేయం ఉన్న అందరిపైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించినట్లు పేర్కొన్నారు. కేశవ్‌ ను హత్య చేసిన ముద్దాయిలను అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిజిపి సూచించారు. నంద్యాలలో తమ అక్రమాలను, దురాగతాలను వెలికి తీస్తున్నాడనే అక్కసుతో స్థానికంగా అరాచకాలను సఅష్టిస్తున్న కొందరు దుండగులు... జర్నలిస్టు కేశవ్‌ ను అత్యంత కిరాకతంగా హత్య చేసిన విషయం విదితమే.