Feb 23,2021 15:01

కోల్‌కతా: బొగ్గు కుంభకోణం కేసులో భాగంగా పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ భార్య రుజిరా బెనర్జీని సిబిఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అనంతరం ఆమెకు సమన్లు అందజేశారు. సిబిఐ అధికారులకు ముందుగానే రుజిరా బెనర్జీ సోమవారం లేఖ రాశారు. తనను ప్రశ్నించేందుకు నివాసానికి రావాలని కోరారు. అలాగే తనను అధికారులు ఎందుకు ప్రశ్నించాలనుకుంటున్నారో తెలియదని తెలిపారు. కునుస్తోరియా, ఖజోరియాల్లో అక్రమ మైనింగ్‌ జరిగిందని, దీనికి సంబంధించి తృణమూల్‌ నేతలకూ డబ్బులు అందాయనే ఆరోపణల నేపథ్యంలో గతేడాది నవంబర్‌లో కేసు నమోదైంది. అయితే.. సిబిఐ అధికారుల రాకకు ముందే అభిషేక్‌ బెనర్జీ ఇంటినిమమతా బెనర్జీ సందర్శించారు. అలాగే అభిషేక్‌ బెనర్జీ మరదలు మేనకా గంభీర్‌ను కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించారు.