Mar 02,2021 23:29

నగదును చూపుతున్న పోలీసులు

ప్రజాశక్తి-కర్నూలు క్రైం: కర్నూలు స్పెషన్‌ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో రూ. 72.50 లక్షల నగదును పట్టుకున్నట్లు సిఐ లక్ష్మీదుర్గయ్య అన్నారు. మంగళవారం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్‌పి ఫకీరప్ప కాగినెల్లి, సెబ్‌ అడిషనల్‌ ఎస్‌పి గౌతమిశాలి ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళుతున్న ఓ ప్రయివేటు బస్సులో ఎలాంటి బిల్లులు లేకుండా ఇద్దరు వ్యక్తులు రూ. 72.50 నగదును తీసుకెళ్తూ పట్టుబడ్డారన్నారు. నిందితులు కర్ణాటక రాష్ట్రం, మంగుళూరు, మలార్‌ కోడికి చెందిన వారుగా గుర్తించామన్నారు. నిందితుల్లో మహమ్మద్‌ నౌషాద్‌ను బస్సు డ్రైవర్‌గాను మహమ్మద్‌ సౌఫాన్‌ను ఓనర్‌ గుర్తించామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ జమాల్‌ బాష, జిలానీబాష, హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు , కానిస్టేబుళ్లు అన్సార్‌ భాషా, ఇమామ్‌ సాహెబ్‌, సుధాకర్‌ విజయభాస్కర్‌ గోపాలకష్ణ పాల్గొన్నారు.