Apr 14,2021 20:20

న్యూఢిల్లీ : అంతర్జాతీయ మార్కెట్‌లో బిట్‌ కాయిన్‌ విలువ రాకెట్‌ల దూసుకుపోతోంది. బుధవారం ఈ క్రిప్టో కరెన్సీ విలువ ఏకంగా 63,825.56 డాలర్ల (రూ.48 లక్షలు) రికార్డు ధర పలికింది. మార్చి నెలలో 61వేల డాలర్లను నమోదు చేయగా.. ఇప్పుడు ఆ రికార్డును దాటేసింది. ఒకవైపు కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ పోతుంటే, ఆంతే స్థాయిలో బిట్‌ కాయిన్‌ విలువ కూడా పెరుగుతుంది. 2020 అక్టోబర్లో 12 వేల డాలర్లుగా ఉన్న బిట్‌ కాయిన్‌ విలువ గత నెలలో 60 వేల డాలర్ల మార్కు దాటడం విశేషం.