
కళాశాల ప్రిన్సిపల్ చెక్కు అందజేత
ప్రజాశక్తి-కందుకూరు :టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌళిక వసతుల కోసం ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇచ్చిన హామీ మేరకు కోవిడ్-19 నిధుల నుంచి రూ.10లక్షల చెక్కును కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్‌కు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్ధుల సంఘం అధ్యక్షులు కంచర్ల రామయ్య, కోవిడ్ కమిటీ సభ్యులు పిడికిటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎంతో ప్రాధాన్యత ఉన్న కళాశాల అభివృద్ధికి ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి సహకరించడం సంతోషించదగిన విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్థుల సంఘం నాయకులు ఎస్.ఏసుదాసు తదితరులు పాల్గొన్నారు.