Mar 02,2021 21:54

ఆర్థిక సాయం అందిస్తున్న ఫాస్టర్లు

    అనంతపురం : అనారోగ్యంతో బాధపడుతున్న వి. పెద్దన్న అనే రోగికి వైద్య సహాయం నిమిత్తం అనంతపురం డిస్టిక్‌ పాస్టర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రూ.3వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. హోసన్నా హోలీ గాడ్‌ చర్చ్‌ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు రెవరెండ్‌ రెడ్డి వారి నెహెమ్యా నాగరాజు , రెవ.పి.మార్క్‌, రెవ జిఆర్‌.ఆనంద్‌ , పాస్టర్లు ఎం.రూఫస్‌, ఎం.శాంతవర్ధన్‌ విజరు పాల్‌ పాల్గొన్నారు.