Oct 24,2021 18:52

రోడ్డు ప్రమాదాలు వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారి కుటుంబాలకు ఆధారం లేక కష్టాలు అనుభవిస్తున్నారు. నిర్లక్ష్యంతో పాటు నిద్రమత్తు వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు ఓ సర్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను జరగకుండా ఉండేందుకు విశాఖపట్నానికి చెందిన బిటెక్‌ చదివిన యువకులు ఓ పరికరం కనుగొన్నారు.
2017లో, డ్రైవర్‌ నిద్రమత్తు వల్ల మన రాష్ట్రంలో ఒకే రోజు రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఒకటి టూరిస్ట్‌ బస్సు కాగా, మరొకటి స్కూలు పిల్లల బస్సు. ఈ ప్రమాదాల్లో చిన్న పిల్లలు, పెద్దవాళ్లు ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణం అప్పట్లో వారి కుటుంబీకులనే కాకుండా ఇంజినీరింగ్‌ చదువుతును ప్రదీప్‌ వర్మను కలిచివేసింది. ఈ ప్రమాదాల నివారణకు సాంకేతికత ఎందుకులేదనే ఆలోచనలో నుంచి పుట్టిందే ఈ పరికరం. 
మొదట కొంత పరిశోధన చేశారు.ఈ మేరకు ప్రమాదం ముందస్తుగా గుర్తించడంతో పాటు వాటిని అంచనా వేసే సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ, డ్రైవర్‌ నిద్రపోతున్నాడని గుర్తించగల పరికరాలు అంత ప్రాముఖ్యంగా లేవని గ్రహించాడు. తన స్నేహితుడు జ్ఞాన్‌ సాయి, రోహిత్‌లతో కలిసి ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపే సాంకేతికతపై పనిచేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో వాహనం నడిపే డ్రైవర్‌, రోడ్డుని రెండింటిని పర్యవేక్షించే వ్యవస్థ కనిపెట్టే దిశగా ప్రదీప్‌ బృందం పనిచేసింది. దానికోసం ఇండిస్టీయల్‌-గ్రేడ్‌ కెమెరాలను అందులో ఉపయోగించారు. ఎ1-వవర్‌తో పనిచేసే ఈ కెమెరాలు డ్రైవర్‌ బ్లింక్‌ రేటును పర్యవేక్షించేలా మిషన్‌లో అమర్చారు. బ్లింక్‌ రేటు నెమ్మదిగా మారితే డ్రైవర్‌ నిద్ర మత్తులోకి వెళ్తునాుడనిఅర్థం. దీంతో డివైజ్‌ వెంటనే అలర్డ్‌ అయిపోయి అతడిని నిద్రలేపడానికి పెద్ద సౌండ్‌ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో డ్రైవర్‌ తనకు తెలియకుండానే కొన్ని సెకన్ల పాటు నిద్రపోతుంటాడు. దీన్నే మైక్రో స్లీప్‌ అంటారు. దీన్ని కూడా కెమెరా ద్వారా ప్రోగ్రామ్‌ చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా ఇంటరొట్‌ ఆధారితమైనది. లకేషన్‌ ఎక్కడో తెలిపేలా జీపీఎస్‌ కూడా ఉంటుంది. సేకరించిన డేటా మొత్తం మిషన్‌కి చేరుతుంది. ఈ సమాచారాన్ని వారు అభివృద్ధి చేసిన యాప్‌ ద్వారా డ్రైవర్‌ ఏ ప్రాంతంలో ఉన్నారో కనిపెట్టవచ్చు. కెమెరా పుటేజీని అందించడమే కాకుండా డ్రైవర్‌ పనితీరు, దానినిఎలా మెరుగుపరచవచ్చు, వారి రహదారి భద్రత గురించి వివరాలను కూడా యాప్‌ అందిస్తుంది. 2018లో ఈ పరికరం దక్షిణ మండలంలోని అంతర్జాతీయ ఇనోువేషన్‌ ఫెయిర్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రదీప్‌ వర్మను ప్రశంసించారు.
2019లో ప్రదీప్‌ వర్మ బృందం 'క్షేమిన్‌ ల్యాబ్స్‌' అనే స్టార్ట్‌ప్‌ను ప్రారంభించి, ఆ పరికరాన్ని మరింత అభివృద్ధి చేసే పనిప్రారంభించారు. తయారు చేసిన డివైజ్‌న్‌ను ఓ ప్రయివేటు బస్సుకు అమర్చి, డ్రైవర్‌ పనితీరును పరీక్షించారు. దీంతో పరికరంలో కొన్ని అవసరమైన మరికొన్ని సాధనాలను చేర్చారు. ఈ పరికరాన్ని ఇప్పుడు పరీక్షించేందుకు అంతర్జాతీయ స్థాయి స్కూలు, రాష్ట్ర రవాణాశాఖ అధికారులతో ప్రవీణ్‌ బృందం చర్చలు జరుపుతుంది. డ్రైవర్‌ నిద్రమత్తుని గుర్తించి అలర్టు చేసే ఈ పరికరం రాబోయే రోజుల్లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూస్తుందని అధికారులు చెబుతున్నారు.

రోడ్డు ప్రమాదాలు నివారిస్తుంది