Apr 14,2021 20:26

'అపరిచితుడు' హిందీ రీమేక్‌లో బాలీవుడ్‌ హీరో రణవీర్‌ నటించనున్నాడని గతంలో ప్రకటించారు. తాజాగా మరో అప్‌డేట్‌ వచ్చింది. బాలీవుడ్‌లో కూడా తెలుగు, తమిళ వర్షెన్లు తీసిన శంకర్‌నే దర్శకత్వం వహించనున్నారని స్పష్టం చేశారు. అలాగే చిత్ర నిర్మాణాన్ని పెన్‌ స్టూడియోస్‌ చేపట్టనుంది.. వచ్చే ఏడాది మధ్యలో నుంచి ఈ చిత్రం షూటింగ్‌ మొదలుకానుంది.