Nov 30,2020 20:59

రహదారిపై అల్లాడుపల్లె వద్ద ఆరబోసిన తడిసిన వరి ధాన్యం

 చాపాడు తుపాన్‌ ప్రభా వంతో తడిసి ముద్దయిన వరి ధాన్యం రంగుమారింది. మండల పరిధిలో ఏ కొద్ది పాటి ఖాళీ ప్రదేశం కనిపి ంచిన అక్కడ రైతులు వరి ధాన్యాన్ని ఆరబెట్టుకుని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నివర్‌ తుపాన్‌తో మండల పరిధిలోని రైతులు తీవ్రంగా నష్టపోయిన విష యం తెలిసిందే. ఆది, సోమవారాల్లో కాస్త భానుడు కన్పించడంతో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుని తిండి గింజలు కైనా ఉంటాయన్న ఆశతో రైతులు అవస్థలు పడుతున్నారు. డిసెంబర్‌ 2 నుంచి తిరిగి మరో తుపాను ఉందని తెలియడంతో ఈ కాస్త సమయం లోనైనా ధాన్యాన్ని ఆరబెట్టుకునే ప్రయత్నం చేస్తు న్నారు. మండల పరిధిలో 12,455 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. రైతులకు రూ.30 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. అమ్మకానికి అటుంచితే తిండి గింజలు కూడా నోచుకోని పరిస్థితి రైతుల్లో నెల కొంది. ధాన్యం పూర్తిగా వచ్చి రంగు మారాయి. వర్షం ఇంతటితో ఆగితే కొంతమంది రైతులు దాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ ఏడాది రైతులకు కన్నీరే మిగిలనుంది.