Nov 09,2020 09:20

రండి పిల్లలు- రారండి పిల్లలు
తోటలోని పూలు తెచ్చి
దండలుగా గుచ్చి గుచ్చి
బాపు బొమ్మకు వేద్దాం.
రండి పిల్లలు - రా రండి పిల్లలు
పాటలెన్నో నేర్చుకుని
పోటీలను పెట్టుకుని
బహుమతులను గెలుద్దాం.
రండి పిల్లలు - రా రండి పిల్లలు
పాఠాలను చదువుకుని
పరీక్షలను ఎదుర్కొని
పై తరగతి కెదుగుదాము.
రండి పిల్లలు - రా రండి పిల్లలు
స్వచ్చంగా బతుకుదాము
స్వేచ్చగా తిరుగుదాము
మంచినే పెంచుదాము.
రండి పిల్లలు - రా రండి పిల్లలు.
పెద్దల యెడ ఒద్దికతో
గురువుల యెడ భక్తితో
కలసి మెలసి తిరుగుదాము
రండి పిల్లలు
రా రండి పిల్లలు
అమ్మంటే ప్రేమచూపి
నాన్న గౌరవాన్ని నిలిపి
ఊరుకి పేరును తెద్దాం
లెండి పిల్లలు - పదండి పిల్లలు.

- కూచిమంచి నాగేంద్ర