Mar 02,2021 22:10

రక్తదాన శిబిరాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌

బొండపల్లి: మొక్కలను విస్తారంగా నాటడం వలన పర్యావరణ పరిరక్షణకు తోడ్పడగలమని కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌ లాల్‌ తెలిపారు. మంగళవారం బొండపల్లి మండలం వేండ్రంలోని భోగివాని చెరువు దగ్గర మొక్కలు నాటే కార్యక్రమం కలెక్టర్‌ ఆధ్వర్యం లో జరిగింది. అనంతరం గ్రామంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ ఆధ్యర్వంలో నిర్వహించిన బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మొక్కలు పెంచడం, చెరువులను సంరక్షించడం, రక్తదానం వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలను చైతన్యవంతులు చేసి మొక్కలు నాటే కార్యక్రమాల్లో అందరినీ భాగస్వామ్యం చేస్తున్న గ్రామానికి చెందిన శ్రీ రామదండు యువతను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డిఎఫ్‌ఒ జానకిరావు, డ్వామా పీడీ నాగేశ్వరరావు, నెహ్రూ యువ కేంద్ర జిల్లా కో-ఆర్డినేటర్‌ విక్రమాదిత్య, ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ ప్రసాదరావు, ఎంపిడిఒ త్రివిక్రమ్‌రావు, తహశీల్దార్‌ సీతారామరాజు, ఎంఇఒ విమలమ్మ, డాక్టర్‌ వెంకటేశ్వరరావు సాయి సిద్దార్థ విద్యా సంస్థల డైరెక్టర్‌ శేఖర్‌, స్కూల్‌ చైర్మన్‌ కె.రాజు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.