Oct 14,2021 19:44

హైదరాబాద్‌ : తలైవా రజనీకాంత్‌ నుండి దసరా కానుక వచ్చేసింది. దర్శకుడు శివ రూపొందిస్తున్న అన్నాత్తే టీజర్‌ను గురువారం చిత్ర బృందం విడుదల చేసింది. దీపావళి కానుకగా నవంబర్‌ 4న విడుదల కానున్న ఈ చిత్రంలో నయనతార, కీర్తిసురేష్‌తో పాటు సీనియర్‌ నటీమణులు కుష్బు, మీనా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ ముగించుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. ఈ టీజర్‌ను రజనీకాంత్‌ అభిమానులను దృష్టిలో పెట్టుకుని విడుదల చేసినట్లుంది. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తుండగా.. డి. ఇమ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు.

                                            ఆ వీడియోను చూసేయండి