Oct 27,2021 22:20

కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-పిఠాపురం డిసెంబర్‌ 13- 14 తేదీల్లో పట్టణంలో జరిగే ఎపి రజక వత్తిదారుల సంఘం 6వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.భాస్కరయ్య పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని స్థానిక సూర్యారాయ విద్యానంద గ్రంథాలయంలో మహాసభల ఆహ్వాన సంఘం కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎం.భాస్కరయ్య మాట్లాడుతూ రజకులకు పూర్తి భద్రత, సామాజిక రక్షణ, రజక సంక్షేమమే ధ్యేయంగా ఎపి రజక వత్తిదారుల సంఘం ఆవిర్భవించి రాష్ట్రవ్యాప్తంగా రజకులను చైతన్య పరుస్తూ సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. వత్తి చెరువులు, భూమి హక్కు, గ్రామాల్లో శ్రమకు తగిన వేతనం, దోబీ ఘాట్‌లో నిర్మాణం, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, బీమా సౌకర్యం, రజకులకు సామాజిక భద్రత కల్పించడమే కాక అర్హులైన ప్రతి రజకునికీ ఇళ్లస్థలాలు అర్హులందరికీ ఇవ్వాలని సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రజక సంఘం రాష్ట్ర మహాసభలు పిఠాపురం పట్టణంలో డిసెంబర్‌ 13, 14 తేదీల్లో నిర్వహిస్తున్నా మన్నారు. రజకుల సమస్యలపై ఈ మహాసభల్లో కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రజకులు అందరూ ఈ మహాసభల్లో పాల్గొని మహా సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు కోనేటి రాజు మాట్లాడుతూ రజకులకు ఏ కష్టం వచ్చినా సమస్య వచ్చినా ఎంపి రజక వృత్తిదారుల సంఘం ముందుండి పోరాడుతుందన్నారు. రజక పెద్దలు, మేధావులు, ఉద్యోగస్తులు, మహిళలు, వత్తిదారులు అందరూ ఐక్యమై మహాసభలు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె.నాగేశ్వరరావు, పి.చంటిబాబు, గంగన్న, రమణ, శ్రీను, రాజేష్‌, నరసింహులు, రాజు, సూర్య నారాయణ, సత్యనారాయణ పాల్గొన్నారు.