Oct 28,2021 17:29

విశాఖ : వచ్చే మూడు రోజులు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం నుంచి వాయవ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5కిమీ ఎత్తు వరకు అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి ఏపీలో పలు చోట్ల మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.