Oct 28,2021 20:56

రిక్షాలు పంపిఛేస్తున్న ఎంపిపి

రిక్షాలు పంపిఛేస్తున్న ఎంపిపి
రిక్షాలు పంపిణీ
ప్రజాశక్తి-డెస్క్‌:జగన్‌ అన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఎఎస్‌ పేట మండల పరిధిలోని 14 పంచాయతీలకు తడి చెత్త,పొడి చెత్త రిక్షా బళ్లను ఆ పంచాయతీ సర్పంచుల సమక్షంలో గ్రీన్‌ అంబాసిడర్లకు 21 రిక్షాల్ళు,126 డస్ట్‌ బిన్లను అందచేసినట్ల మండల పరిషత్‌ అధ్యక్షురాలు బోయిళ్ళ పద్మజా రెడ్డి . తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి మేకపాటి ఆదేశాల ప్రకారం గ్రామాలలో పారిశుధ్యం పెంచేందుకు ఈ సైకిళ్లు ఉపయోగ పడతాయని తెలిపారు.

మండలంలోని అందరూ నాయకుల, మండల పరిషత్‌ అధికారుల సమక్షంలో పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల కో ఆప్షన్‌ సభ్యులు సయ్యద్‌ సందాని బాషా,ఎంపిటిసి సభ్యురాలు గరికిపాటి చిన్నమ్మ, వైసిపి నాయకులు పులిమి వెంకట రమేష్‌ రెడ్డి, గుంపర్లపాడు వైసిపి నాయకులు వనిపెంట రంగారెడ్డి, సిరిగిరి వెంకటేశ్వర్‌ రెడ్డి,కావలి ఎడవల్లి వైసిపి నాయకులు ఎడవల్లి మాల్యాద్రి ,జమ్మవరం శ్రీహరి,రాజవోలువైసిపి నాయకులు శీనయ్య,షేక్‌ ఇలియాజ్‌,షేక్‌ ఖాదర్‌ తదితరులు పాల్గొన్నారు.