Oct 28,2021 20:50

మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌ ఎస్‌ రవికుమార

మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌ ఎస్‌ రవికుమార
రికార్డుల పరిశీలన
ప్రజాశక్తి-కోవూరు అర్బన్‌:మండలంలోని సెబ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ని సూపరింటెండెంట్‌ ఎస్‌ రవికుమార్‌ సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత డ్రగ్స్‌ కు దూరంగా ఉండాలని సూచించారు. జిల్లాలో డ్రగ్స్‌ మాఫియాపై నిరంతరం దాడులు చేస్తున్నామని పేర్కొన్నారు.అనుమానిత ప్రాంతాల్లో అనుమానాస్ప
ద వ్యక్తుల కోసం నిఘా ఉంచామన్నారు. కోవూరు సర్కిల్‌ పరిధిలో గంజాయి గాని బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎక్సైజ్‌ ఎస్‌ఐకి సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. గురువారం జరగాల్సిన వాహనాల వేలం పాటకు తక్కువ మంది రావడంతో వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.