Apr 27,2021 20:57

ముంబాయి : 2020-21 ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో 1.42కోట్ల డిమాట్‌ ఖాతాలు ప్రారంభమయ్యాయి. 2021మార్చిలోనే 19 లక్షల డిమాట్‌ ఖాతాలను తెరిచారు. కొన్ని వ్యాపారాల్లో నెలకొన్న సమస్యలు, ఇబ్బందులు కారణంగా భారతీయ పెట్టుబడిదారులు స్టాక్‌ మార్కెట్లలో కొత్త అవకాశాలను వెతుక్కుంటున్నారని, అందువల్లే డీమాట్‌ ఖాతాల సంఖ్య గణనీయంగా పెరిగిందని భావిస్తున్నారు. 2020 ఆర్థిక సంవత్సరంలో 49 లక్షల డీమాట్‌ ఖాతాలే ప్రారంభం కావడం గమనార్హం.
పెట్టుబడిదారులు తమ డబ్బును బంగారం, రియల్‌ ఎస్టేట్‌, బ్యాంకు డిపాజిట్ల వంటి సాంప్రదాయ విధానాల నుండి స్టాక్స్‌ వంటి ప్రత్యామ్నాయాల్ల పెట్టుబడిగా పెడుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.