Nov 30,2020 20:58

అధికారులనుద్దేశించి మాట్లాడుతున్న కలెక్టర్‌ హరికిరణ్‌

 కడప ప్రస్తుతం నగర రోడ్ల విస్తరణ పనులు మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ సంబంధిత అధికా రులను ఆదేశించారు. సోమవారం కలెక్టరే ట్లోని తన చాంబర్లో నగర రోడ్ల విస్తరణ పనులు, వరదల కారణంగా ఏర్పడిన చెతా ్తచెదారం, బురద, మట్టి తొలగింపు, పారిశుధ్య నిర్వహణ, బుగ్గవంక పరివాహక ప్రాం తంలో వరదల్లో ముంపుకు గురైన ఇళ్లు, కుటుంబసభ్యుల గణన తదితర అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త కలెక్టరేట్‌ కార్యాలయం నుంచి సిడబ్ల్యుసి (సెంట్రల్‌ వేర్‌ హౌస్‌ కార్పొరేషన్‌) కాంపౌండు వరకు, అక్కడ నుంచి రిమ్స్‌ వెళ్లే దారిలో ఉన్న రైల్వే అండర్‌ బ్రిడ్జి వరకు 100 అడుగుల వెడల్పుతో చేస్తున్న రహదారి విస్తరణ పనులు, రైల్వేస్టేషన్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు 80 అడుగుల వెడల్పుతో చేపట్టిన రోడ్ల విస్తరణ పనుల ప్రగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.నగర అభి వద్ధి, సుందరీకరణ పనుల్లో భాగంగా ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా, రహదారులను మరింత సౌకర్య వంతంగా, ఆహ్లాదకరంగా, అధు నాతన హంగులతో తీర్చిదిద్దాలని పేర్కొ న్నారు. బుగ్గవంక పరివాహక ప్రాంతంలో వరదలు వచ్చిన ప్రదేశాలలో పారిశుధ్యం నెలకొల్ప డానికి చేపట్టిన పనుల గురించి అధికా రులను అడిగి తెలుసు కున్నారు. వరద నీరు ప్రవహించిన ప్రాంతాలలోని రోడ్లలో చెత్తను, చెదారాన్ని, బురద మట్టిని వెంటనే తొలగి ంచాలని పేర్కొ న్నారు. సాధారణ స్థితికి తీసుకురావాలని మునిసిపల్‌ శాఖ ఇంజి నీరింగ్‌, హెల్త్‌ విభాగం ఇంజనీర్లను కలెక్టర్‌ ఆదేశించారు. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. నివర్‌ తుపాన్‌ ప్రభావంతో నగరంలో బుగ్గవంక పరి వాహక ప్రాంతంలో వరదల్లో మునిగి పోయిన ఇళ్లను పరిశీ లించి, ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున ఆర్థిక సాయం అంద జేస్తామని చెప్పారు. సమావేశంలో కలెక్టర్లు ఎం గౌతమి, సాయికాంత్‌ వర్మ, సబ్‌ కలెక్టర్‌ పద్వి తేజ్‌, శిక్షణ కలెక్టర్‌ వికాస్‌ మర్మాట్‌, మున్సిపల్‌ కమిషనర్‌ లవన్న, తహశీల్దార్‌ శివరామిరెడ్డి, నగరపాలక సంస్థ ఇంజనీ రింగ్‌ విభాగం అధికారులు పాల్గొన్నారు.