Jun 11,2021 15:35

అమరావతి : రఘురామకృష్ణమరాజును డిస్‌క్వాలిఫై చేయాలని వైసిపి చీఫ్‌ విప్‌, ఎంపి మార్గాని భరత్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభ స్పీకర్‌ను ఆయన కలిసి ఫిర్యాదు చేశారు. రఘురామ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే రఘురామ కృష్ణమరాజు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. ఎపిలో వైసిపి ఎంపి రఘురామకృష్ణమరాజుకు, వైసిపి ప్రభుత్వానికి మధ్య వార్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంపి భరత్‌ స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.