Dec 04,2021 03:09

ఎంపికైన వారితో పాఠశాల సిబ్బంది

ప్రజాశక్తి - సబ్బవరం : మండలంలోని తవ్వవానిపాలెం జెడ్‌పి.హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి రగ్బీ పోటీలకు ఎంపికయినట్లు ప్రధానోపాధ్యాయులు బివి.రమణ శుక్రవారం తెలిపారు. ఆరుగురు విద్యార్థినులు ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్‌ బోకం స్వామినాయుడు విద్యార్థులను అభినందించారు. వారికి స్పోర్ట్స్‌ కిట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. పీడీ డి.కిరణ్‌ కుమార్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఎంపిటిసి బోకం బాలకృష్ణ, అమృతపురం సర్పంచ్‌ బైలపూడి గౌరీ రామారావు, ఎంపిటిసి సింగంపల్లి శ్రీనివాసరావు, చింతగట్ల సర్పంచ్‌ గనిశెట్టి కనకరాజు, ఎంపిటిసి అప్పలరాజు, ఎస్‌ఎంసి చైర్మన్‌ ఈశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.