Jan 25,2021 21:50

స్థలం పరిశీలిస్తున్న దశ్యం.

ప్రజాశక్తి - నంద్యాల రూరల్‌: నంద్యాల పట్టణం నుండి పులిమద్ది మీదుగా నందికొట్కూరు, ఆత్మకూరు వరకు కొనసాగుతున్న రెండు వరుసల రోడ్డు పనులను సబ్‌ కలెక్టర్‌ కల్పనా కుమారి సోమవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ పులిమద్ది గ్రామ సమీపంలో భూసేకరణ, రోడ్డు నిర్మాణాలపై రహదారులు, భవనాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించినట్లు చెప్పారు. విఆర్‌ఒలు శేఖర్‌, నాగరాజు, సర్వేయర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.