May 03,2021 22:30

పల్లెకెలె: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక జట్టు 1-0తో కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్‌ 437 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఖరిరోజు 227 పరుగులకే కుప్పకూలింది. దీంతో శ్రీలంక రెండోటెస్ట్‌ 209 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 5 వికెట్ల నష్టానికి 177 పరుగులతో సోమవారం ఆటను కొనసాగించిన బంగ్లాదేశ్‌.. మెహిదీ హసన్‌(39), ముస్తఫికర్‌(40) మాత్రమే రాణించారు. జయవిక్రమకు ఐదు, రమేశ్‌ మెండీస్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ జయవిక్రమకు, సిరీస్‌ కరుణరత్నేకు దక్కాయి. ఇరుజట్ల మధ్య జరిగిన తొలిటెస్ట్‌ డ్రా అయ్యింది.