Nov 30,2020 20:03

ఫొటో : తహశీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు

ఫొటో : తహశీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు
రేషన్‌లో ఆన్‌లైన్‌ సమస్యలు పరిష్కరించాలి
- తహశీల్దారుకు సిపిఎం నేతల వినతి
ప్రజాశక్తి-కోవూరుఅర్బన్‌ : రేషన్లల్లో ఆన్‌లైన్‌ ఇబ్బందుల వల్ల లబ్ధిదారులు సరిగా సరుకులను పొందలేక పోతున్నారని, ఆ సమస్యను పరిష్కరించాలని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం తహశీల్దారు సుబ్బయ్యకు ఆన్‌లైన్‌ సమస్యలను తొలగించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి గండవరపు శేషయ్య మాట్లాడుతూ మండలంలోని ప్రజలు అన్ని రేషన్‌ షాపుల్లో ఆన్‌లైన్‌ సక్రమంగా పనిచేయక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సత్వరమే ప్రభుత్వం స్పందించి ఆన్‌లైన్‌ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. గతంలో ఇలా సర్వర్లు పనిచేయనప్పుడు తహశీల్దార్‌ జోక్యం చేసుకొని ఆన్‌లైన్‌తో సంబంధం లేకుండా నేరుగా ప్రజలకు అందించేలా రేషన్‌ డీలర్లకు ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు సర్వర్లు పనిచేయని కారణంగా సరుకులు రేషన్‌ షాప్‌ వద్దే మిగిలి పోతున్నాయని వాటివల్ల ఉపయోగం లేదని తెలిపారు.
ఈ విషయంపై జిల్లా సివిల్‌ సప్లరు అధికారులు, తహశీల్దార్‌ జోక్యం చేసుకొని పేద ప్రజలకు సకాలంలో గడువు తేదీ లోపల సరుకులు అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మారుబోయిన సుబ్బారావు, కరకంబాక రామయ్య, ఎస్‌కె.బాబు, బుజ్జయ్య, పెద్డబ్బయ్య, సురేష్‌, విజయకుమార్‌, ఈగ హరి, శ్రీనివాసరావు, రమణయ్య, ప్రసాద్‌, సుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు.