
ప్రపంచ వ్యాప్తంగా కరోనా లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన క్రికెట్ అభిమానులను మొన్నటి వరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఉత్సాహపరచగా.. ఇప్పుడు ఫుట్‌బాల్ ప్రియులను ఉత్సాహపరిచేందుకు ఇండియన్ సూపర్ లీగ్ రాబోతోంది. ఆల్ ఇండియా ఫుడ్‌బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గోవా వేదికగా రేపటి నుంచి ఇండియన్ సూపర్ లీగ్ ప్రారంభం కానుంది. సుమారు 4 నెలలపాటు ఈ టోర్నీని నిర్వహించనున్నారు. లీగ్ నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఈ లీగ్‌లో టైటిల్ కోసం మొత్తం 11 జట్లు తలపడనున్నాయి. నాలుగు నెలల పాటు మొత్తం 115 మ్యాచులు జరుగుతాయి. అన్ని మ్యాచులు ప్రతి రోజు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి. తొలి రోజు (20వ తేది) మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్, ఎటికె మొహున్ బాగన్ జట్లు తలపడనున్నాయి. 2019-20 సీజన్లో గోవా, ఎటికె జట్లు మంచి ప్రదర్శన కనబరిచి తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఐపిఎల్ స్పాన్సర్‌గా వ్యవహరించిన డ్రీమ్11 ఈ లీగ్‌లోనూ ఓ స్పాన్సర్‌షిప్‌గా వ్యవహరించనుంది.
జట్లు :
- - ఎటికె మొహున్ బాగన్
- బెంగళూరు ఎఫ్‌సి
- చెన్నయిన్ ఎఫ్‌సి
- ఎఫ్‌సి గోవా
- హైదరాబాద్ ఎఫ్‌సి
- జంషేడ్‌పూర్ ఎఫ్‌సి
- కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సి
- ముంబై సిటీ ఎఫ్‌సి
- నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సి
- ఒడిషా ఎఫ్‌సి
- ఎస్సి ఈస్ట్ బెంగాల్