
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీపై పోలీసులు విరుచుకుపడ్డారు. సరిహద్దుల వద్దకు ఉదయం 8 గంటలకే వేలాది మంది రైతులు చేరుకున్నారు. టిక్రీ సరిహద్దు నుండి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు యత్నించిన రైతులు అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను పగులగొట్టారు. దీంతో పోలీసులు రైతులపై విరుచుకుపడ్డారు. వారిపై లాఠీఛార్జ్ చేయడంతో పాటు టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు. అధికారిక రిపబ్లిక్ పరేడ్ ముగిసిన అనంతరం.. కిసాన్ పరేడ్‌కు పోలీసులు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.
రైతులపై టియర్‌గ్యాస్ ప్రయోగం : (దృశ్యాలు)



