
ప్రజాశక్తి-తర్లుపాడు: తుఫాన్ ప్రభావం వల్ల పంటలను నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. తర్లుపాడు మండలంలో గత కొద్ది రోజుల నుండి తుఫాన్ వల్ల కురుస్తున్న వర్షానికి మిర్చి, పప్పుశనగ, మినుము, వరి, కంది పంటలు నీటమునిగి దెబ్బతినడంతో ఆయన ఆదివారం పరిశీలించారు. సీతానాగులవరం గ్రామంలో నీటమునిగిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం కళ్లాల్లో ఆరబోసిన పండు మిర్చిని పరిశీలించారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నమోదు కార్యక్రమం చేపడతారని చెప్పారు. రైతులెవరూ ఆందోళన చెందొద్దన్నారు. పంట నష్టం అంచనాలను డిసెంబర్ 15వ తేదీ లోపల నివేదికలు తయారు చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట వైసిపి నాయకులు సూరెడ్డి రామసుబ్బారెడ్డి, రేకుల అంకయ్య, దాసయ్య, గ్రామ రైతులు పాల్గొన్నారు. పొదిలిటౌన్: నివర్ తుపాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి తెలిపారు. మండలంలోని మూగచింతలలో తుపాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఎఒ శ్రీనివాసులరెడ్డి, విఆర్ఒ సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి శేషగిరి, వైసిపి నాయకులు పాల్గొన్నారు. కొనకనమిట్ల: నివర్ తుపాన్‌కు నీటమునిగి దెబ్బతిన్న పంటలను మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి పరిశీలించారు. రెేగుమానిపల్లె, మర్రిపాలెం, కొనకనమిట్ల, గనివాడుపాడు, ఎదురాళ్ళపాడు గ్రామాల్లో దెబ్బతిన్న బొబ్బర్లు, మినుము పంటలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఎఒ బాలాజీనాయక్, రైతులు పాల్గొన్నారు.