Nov 30,2020 00:25

పంటలను పరిశీలిస్తున్న టిడిపి ప్రజాప్రతినిధులు

కశింకోట : నివర్‌ తుపాను బాధిత రైతులను ఆదుకోవడంలో వైసిపి ప్రభుత్వం విఫలమైందని టిడిపి నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు విమర్శించారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌కుమార్‌, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కె.అప్పలనాయుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషా, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్‌ కలిసి మండలం లోని చింతల పాలెం, ఎన్‌జి.పాలెం గ్రామాల్లో తు పానుకు దెబ్బతిన్న పంటలను ఆదివారం పరిశీలించారు. దెబ్బతిన్న పంటలకు పది రోజుల్లో నష్టపరిహారం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. తాడేపల్లిలో గడిపేందుకు ఉన్న సమయం రైతుల కన్నీళ్లు తుడవడానికి కూడా లేకుండా పోయిందా ? అని ప్రశ్నించారు. ప్రతి రైతుకూ ఎకరాకు రూ.25 వేల తక్షణ సాయం అందజేయాలని డిమాండ్‌ చేశారు. ఒక్క అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోనే 30 వేల హెక్టార్లలో వరి పంట దెబ్బతిందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కాయల మురళి, రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ, అర్బన్‌ జిల్లా ఉఫాధ్యక్షులు మళ్ళ సురేంద్ర, బుద్దిరెడ్డి చిన్నా, వేగి గోపీకృష్ణ, సిదిరెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు.