
కృష్ణా (మోపిదేవి) : తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులందరికీ పంట నష్టపరిహారం అందజేయాలని మోపిదేవి మండలం సిపిఎం కార్యదర్శి బండి ఆదిశేషు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మోపిదేవి మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించి నీట మునిగిన పంటలను సిపిఎం బృందం పరిశీలించింది. నేటికీ పంటలు నీటిలో మునిగి తేలియాడుతుండటంపై విచారం వ్యక్తం చేశారు. మిగిలిపోయిన పంట కోతకు యంత్రాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. పంట అంచనా బృందం పారదర్శకంగా సర్వే నిర్వహించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బెజవాడ నాగేశ్వరరావు, ఏం.సురేష్, మద్దాల వెంకటేశ్వరరావు, సిరివెళ్ల రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.