Nov 29,2020 22:31

అల్లవరంలో రైతులతో మాట్లాడుతున్న మంత్రి విశ్వరూప్‌

ప్రజాశక్తి-యంత్రాంగం : జిల్లాలో దెబ్బతిన్న పంటలను వైసిపి, టిడిపి నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఆదివారం పరిశీలించారు. రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలని, కౌలు రైతులకే పరిహారం ఇవ్వాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. రైతులను ఆదుకోవడంలో వైసిపి ప్రభుత్వం విఫలం అయ్యిందని టిడిపి నాయకులు విమర్శించారు. రైతులను ఆదుకుంటామని వైసిపి నేతలు హామీలు గుప్పించారు.
కాజులూరు మండలం పాత మంజేరు, కొత్త మంజేరులో వరి పొలాలను ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మండలంలో సుమారు నాలుగు వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. పూర్తిగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేసిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పంపన సత్యనారాయణ, ఎం.వెంకటేశ్వరరావు, కోరుకొండ ప్రసాద్‌, పలివెల రవి, బడుగు శ్రీనివాసు పాల్గొన్నారు. ఐ.పోలవరం మండలం పాతఇంజరం దేవస్థానం సమీపంలో ఉన్న నేలకొరిగిన వరి పంటలను, మొలకెత్తిన తడిసిన ధాన్యాన్ని ముమ్మిడివరం ఎంఎల్‌ఎ పొన్నాడ సతీష్‌ కుమార్‌ పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల కన్వీనర్‌ పిన్నమరాజు వెంకట పతిరాజు, బాబ్జిరాజు, ముదునూరి సతీష్‌ రాజు, బుల్లిరాజు, పెద్దిరెడ్డి రాంబాబు, చప్పిడి వెంకటేశ్వరావు, తహశీల్దార్‌ అజీర్‌ హుసేన్‌, విఆర్‌ఒ నాగేంద్ర ప్రసాద్‌ పాల్గొన్నారు. ఉప్పలగుప్తం మండలంలో మంత్రి విశ్వరూప్‌ పర్యటించారు. ముంపు, వర్షాలకు దెబ్బతిన్న వరి చేలను పరిశీలించారు. నంగవరం, సన్నవిల్లి, పేరాయిచెరువు, కూనవరం నష్టపోయిన రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమాలలో వైసిపి మండల అధ్యక్షుడు బద్రి బాబ్జి, జిన్నూరి వెంకటేశ్వరరావు, చిక్కం బాలయ్య, మారిశెట్టి పుండరీకాక్షుడు, మోటూరి సత్యం కాపు, గొలకోటి దొరబాబు, ఒంటెద్దు వెంకన్నాయుడు, ఆకుల బాలాజీ, ఊటాల రామాంజనేయులు పాల్గొన్నార. సామర్లకోట మండలం గొంచాల, రావువారి చంద్రపాలెం, నవర గ్రామాల్లో టిడిపి నాయకులు జ్యోతుల నవీన్‌, కాకినాడ మేయర్‌ సుంకర పావని తుని ఇన్‌ఛార్జి యనమల కష్ణుడు, ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప, కాకి గోవిందరెడ్డి, కోరాడ రాజబాబు నష్టపోయిన రైతులతో మాట్లాడారు. అడబాల కుమారస్వామి, తోటకూర శ్రీను, ముమ్మడి సూరిబాబు, రాజా సూరిబాబు రాజు, వంశీ పాల్గొన్నారు. కొత్తపేట మండలం గంటి గ్రామంలో పంట పొలాలను టిడిపి నాయకులు పరిశీలించారు. టిడిపి మండల అధ్యక్షులు కంఠంశెట్టి శ్రీనివాసరావు, తులా రాజు, ముదునూరి లింగరాజు, గుబ్బల మూర్తి, చెల్లి రాజశేఖర్‌, గూటం అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం పటవల, జి.వేమవరంలో పంట పొలాలను ఎంఎల్‌ఎ పొన్నాడ సతీష్‌ కుమార్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టాలని తహశీల్దారు, వ్యవసాయ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. వైసిపి మండల అధ్యక్ష కార్యదర్శులు కాదా గోవింద కుమార్‌, రాయుడు గంగాధర్‌, కొటికలపూడి చంద్రశేఖర్‌, కాలా వెంకటరమణ, కొప్పిశెట్టి వెంకట్‌ పాల్గొన్నారు. పోలేకుర్రు పరిధిలోని చినబొడ్డు వెంకట పాలెంలో పంటపొలాలను వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టి.ఈశ్వరరావు పరిశీలించారు. పంట చేతికొచ్చే సమయంలో కౌలు రైతులు పూర్తిగా నష్టపోయార న్నారు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం భూ యజమానులకు ఇస్తున్నారని, దానివల్ల కౌలురైతులు నష్టపోతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి దుప్పి అదష్టదీపుడు, కాపా భైరవమూర్తి, చొల్లంగి వీర్రాజు, మందాల రాంబాబు, పితాని త్రిమూర్తులు, కాశి కష్ణమూర్తి పాల్గొన్నారు. కాట్రేనికోనలో టిడిపి ఎంఎల్‌సి ద్వారపురెడ్డి జగదీష్‌ బందం పంట పొలాలను పరిశీలించారు. పంటనష్టాన్ని వెంటనే అంచనా వేసి రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ దాట్ల బుచ్చి బాబు, నాగీడి నాగేశ్వరరావు, గుత్తుల సాయి, కముజు లక్ష్మీ రమణ రావు, విత్తనాల బుజ్జి, వెంకటరమణ పాల్గొన్నారు. గోకవరంలో టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పంటలను పరిశీలించారు. అయినవిల్లి మండలంలో టిడిపి మండల అధ్యక్షులు చిట్టూరి శ్రీనివాస్‌ బృందం పంటలను పరిశీలించారు. నేదునూరి సావరం గ్రామంలో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి మాజీ ఛైర్మన్‌ మద్దాల సుబ్బరావు, మాజీ ఎంపిపిలు సలాది పుల్లయ్య నాయుడు, మట్టపర్తి రాజేశ్వరరావు, నాయకులు సయ్యపురాజు సత్తిబాబు, మట్టపర్తి అచ్యుత్‌, మోత వెంకటేశ్వరరావు, కుడుపూడి బుజ్జి, కళ్లేపల్లి సుబ్బరాజు, దంగేటి రమణ, వర్రే శ్రీను, తోట సుబ్బారావు, మేడిశెట్టి అంజిబాబు, వస్కా శ్యాం, గంటి రాజేశ్వరి పాల్గొన్నారు. అల్లవరం మండలంలోని ఎంట్రుకోన, అల్లవరం, రెల్లుగడ్డలో ముంపునకు గురైన వరి పంటలను మంత్రి విశ్వరూప్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనతో కౌలు రైతులు మాట్లాడారు. నష్టపరిహారం తమకు అందడం లేదని, పంట కాలువలు, బోదెలు, డ్రెయినేజీలు ఆక్రమణకు గురయ్యాయని, డ్రైయినేజీలో వలకట్లు ఉండటం వల్ల పంట పొలాల్లో నీరు దిగడం లేదని మంత్రికి వివరించారు. ప్రతి రైతుకూ పరిహారం అందిస్తామని మంత్రి విశ్వరూప్‌ వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎడి ఎంఎం షంషీ, ఎంపిడిఒ ఎం.రాఘవులు, తహశీల్దారు అప్పారావు, ఎఒ ఎన్‌వివి.సత్యనారాయణ, ఆర్‌ఐ ఎం.దుర్గశ్రీను, దుర్గ శ్రీను, ఎస్‌ఎస్‌విఎస్‌.రాజేశ్వరరావు, శ్రీరామ చంద్రమూర్తి, కొనుకు బాపూజీ, ఇళ్ల శేషారావు, బొక్కా శ్రీనువాస్‌, బొక్కా ఆదినారాయణ, బొమ్మి ఇజ్రాయిల్‌, తొట్టపు బాబీ, జంపన రమేష్‌ రాజు, గుబ్బల రంగనాథ స్వామి పాల్గొన్నారు.